
పెద్దపల్లి
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
7
‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’
‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్‌గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్‌మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.
నా కొడుకును ఇంజినీర్‌గా చూడాలి.. డాక్టర్‌ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్‌వేర్‌గా.. డాక్టర్‌గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్‌లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్‌లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోu
న్యూస్‌రీల్

పెద్దపల్లి

పెద్దపల్లి

పెద్దపల్లి

పెద్దపల్లి