
టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్‌దే
● ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్/పెద్దపల్లిరూరల్(పెద్దపల్లి): టెక్నాలజీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు బి.సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నాయకులు బొంకూరి అవినాష్, ఈర్ల స్వరూప, మల్లయ్య, సంపత్, శ్రీకాంత్, అమ్రేశ్, సుభాష్‌రావు, అక్బర్‌అలీ, మస్రత్, శ్రీనివాస్, శ్యాంసుందర్, దేవరాజ్ పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యం కోసమే మార్కెట్
పెద్దపల్లిరూరల్/జూలపల్లి: పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను రూ.4కోట్ల 20లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జెండా కూడలిలోని కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అదేవిధంగా జూలపల్లి హుస్సేన్‌మియావాగుపై చేపట్టిన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు.