
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో ‘రామగుండం’ ప్రతిభ
గోదావరిఖని/రామగుండం: క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో రామగుండం పోలీస్‌కమిషనరేట్ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ప్రజలు, బాధితులు, ఫిర్యాదు దారులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్‌స్టేషన్లలోని సి బ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్‌స్టేషన్లలో సరైన ఆదరణ, సేవలు లభిస్తున్నాయా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నా రు? తదితర విషయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. క్యూఆర్‌కోడ్ అండ్ సీఎఫ్‌సీద్వారా పోలీసు సేవలపై ప్రజల నుంచి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనిట్లను ఎంపిక చేశారు. దీనిలో రామగుండం పోలీస్‌కమిషనరేట్ మూడోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ తరఫున మంచిర్యాల డీసీపీ భాస్కర్, అంతర్గాం ఠాణా ఎస్సై బోయ వెంకటస్వామి బుధవారం డీజీపీ జితేందర్ నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసులను అభినందించారు. పోలీసుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఎప్పటికప్పుడు అందజేయాలని సీపీ కోరారు.

సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో ‘రామగుండం’ ప్రతిభ