
నిర్మాణం పూర్తయ్యాకే కూల్చివేత
● ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్(పెద్దపల్లి): కొత్త షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం పూర్తయ్యాకే పాత కాంప్లెక్స్ భవనాల కూల్చివేతలు ఉంటాయని, అప్పటివరకు వ్యాపారం కొనసాగించవచ్చని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రూ.42లక్షల అంచ నా వ్యయంతో స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ఎదుట చేపట్టిన కాంప్లెక్స్ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుల్తానాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇందుకోసం అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి, నాయకులు గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, అబ్బయ్య, చిలుక సతీశ్, బిరుదు కృష్ణ, రఫీ పాల్గొన్నారు.