
ఆపరేషన్ పోచమ్మ మైదాన్
గోదావరిఖని: అది వివాదాస్పద పోచమ్మ మైదా న ప్రాంతం.. ఒకవైపు పోలీసులు.. మరోవైపు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వెంటే జేసీబీల రాక.. ఏమైందోనని స్థానికులు తెలుసుకుని తేరుకునేలోపే కట్టడాల కూల్చివే ప్రారంభమైంది. షాపుల్లో అద్దెకు ఉంటున్న వారు, యాజమానులు అడ్డుకున్నా.. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపుల ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన కూల్చివేతలు బుధవారం తెల్లవారుజాము వరకూ సుమారు 12 గంటల పాటు కొనసాగాయి.
రాత్రి పది గంటల తర్వాత..
వివాదాస్పద స్థలంలోని కట్టడాల కూల్చివేత తొలుత ఆరు జేసీబీలతో ప్రారంభం కాగా.. రాత్రి 10 గంటల వరకు పొక్లెయిలు, ప్రత్యేక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. జనగామ శివారులోని పోచమ్మ మైదానం భూహద్దుల విషయంలో ఈనెల 18న జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) సర్వే చేశారు. మరుసటి రోజే కట్టడాల కూల్చివేత ప్రారంభమైంది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుటి భవనాన్ని ఇప్పటికే కూల్చివే యగా, ఇదేప్రాంతంలోని షాపులను తాజాగా తొల గించారు. వ్యాపారులు దుకాణాలను ఖాళీచేసి వెళ్లిపోయారు. ఇదే ప్రాంతంలోని ఓషాప్‌లో అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న మణప్పురం బ్యాంకును ఖాళీచేసేందుకు కొంత గడువు ఇచ్చారు. ఇందులో లాకర్లు, విలువైన సామగ్రి ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకూ నిర్వాహకులు గడువు కోరారు. దీంతో ఈ ఒక్క భవనం కూల్చివేత తాత్కాలికంగా నిలిపివేశారు.
గతంలో కూరగాయల మార్కెట్..
సింగరేణి కార్మిక కుటుంబాల కోసం గతంలో పోచమ్మ గుడిని ఆనుకుని కూరగాయాల మార్కెట్, మాంసం దుకాణాలు, చిరువ్యాపారాలు, సింగరేణి బ్యారెక్స్ ఉండేవి. వాటినుంచి సింగరేణి అద్దెవసూలు చేసేది. క్రమంగా సింగరేణి స్థలం కనుమరుగై ఇతరుల చేతుల్లోకి వెళ్లి దుకాణాలు వెలిశాయి. తమదే ఈ స్థలమంటూ కొందరు కోర్టుమెట్లు ఎక్కారు. చాలాఏళ్లుగా ఈ అంశంలో పెండింగ్ ఉంటూ వస్తోంది. చివరకు ఆ స్థలం తమదేనంటూ సింగరేణి కట్టడాలు కూల్చివేసి స్వాధీనం చేసుకుంటోంది.
అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి..
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ని యోజవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ఇందుకోసం నగరంలో రోడ్ల విస్తరణ, పాత దుకాణాల స్థానంలో ఆధునిక షాపింగ్‌కాంప్లెక్స్, కార్పొరేట్ స్థాయి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించా రు. ఇందులో భాగంగానే తొలుత ఓల్డ్ అశోక టాకీస్‌ను తొలగించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. ఆ తర్వాత సింగరేణి క్వార్టర్ల కూల్చివేత ప్రారంభించారు. రాజేశ్ థియేటర్, బస్టాండ్ సమీపంలోని భవనాలు కూడా కూల్చివేశారు. దీంతో బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వచ్చాయి. తాజాగా పోచమ్మ మైదానంలోని వివా దాస్పద స్థలంలో కట్టడాలపై దృష్టి సారించారు.
భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
పోచమ్మ మైదానంలోని 39 గుంటల స్థలం స్వాధీ నం చేసుకుంటున్న సింగరేణి యాజమాన్యం.. దానిని ఎలాంటి అవసరాలకు వినియోగిస్తుందనే చర్చ అప్పుడే మొదలైంది. ప్రధానంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఇదే స్థలంలో ఉండగా, ఇంకా చాలాస్థలం ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనం జరుగుతోంది. నిపుణులు ఇప్పటికే షాపింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించి భవిష్యత్ ప్రణాళికపై రూట్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులో తేవడమా? నిధులు ఎక్కువ అవసరమైతే దానిని కూల్చివేసి పోచమ్మగుడి వరకు అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలా? అందులోనే వాహనాల పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలా? అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పోచమ్మ గుడిని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించేలా నిర్ణయించినట్లు సమాచారం. పోచమ్మగుడి నుంచిప్రధానచౌరస్తా వరకు ఉన్న స్థలంలో మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.