
బాధ్యతలు స్వీకరణ
కోల్‌సిటీ(రామగుండం): రా మగుండం బల్దియాకు ప్రభుత్వం ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో జనగామ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన పి.వెంకటేశ్వర్లు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా, వెయిటింగ్‌లో ఉన్న గ్రేడ్–2 ము న్సిపల్ కమిషనర్ ఎం.ఉమామహేశ్వర్‌రావు కార్యదర్శిగా నియమించగా శుక్రవారం వారు బాధ్యతలు స్వీకరించారు. అలాగే వెయిటింగ్‌లో ఉన్న గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతిప్రసాద్‌ను అడిషనల్ కమిషనర్‌గా నియమించగా.. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.
పనులు పూర్తిచేయాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): అభివృద్ధి ప నులను త్వరగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ లబ్ధిదారులకు సూచించారు. గర్రెపల్లిలో పనుల జాతర –2025 పనులు ప్రారంభించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, పంచా యతీ కార్యదర్శి లచ్చన్న, మాజీ ప్రజాప్రతినిధులు వెంకటేశం, జానీ పాల్గొన్నారు.
రేషన్ దుకాణాలకు బియ్యం
కమాన్‌పూర్(మంథని): జిల్లాలోని రేషన్ దుకాణాలకు సెప్టెంబర్ కోటా సన్నబియ్యాన్ని ప్ర భుత్వం సరఫరా చేస్తోంది. గత జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన మూడునెలల బి య్యాన్ని ఒకేసారి గత జూన్‌లో అందించిన వి షయం విదితమే. ఈక్రమంలో సెప్టంబర్ కో టా బియ్యాన్ని జిల్లాలోని 413 రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది.
విద్యుత్ అధికారుల పొలంబాట
కమాన్‌పూర్(మంథని): విద్యుత్ అధికారులు శుక్రవారం జూలపల్లిలో పొలంబాట నిర్వహించారు. ఎస్‌ఈ గంగాధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్‌తో కూడిన స్టార్టర్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీఈలు బాలయ్య, ప్రభకర్, ఏఈ అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానిదే బాధ్యత
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యతని టీజీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శన్‌గౌడ్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయన మా ట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలి ట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించా లాన్నారు. ప్రతినిధులు నాగవెల్లి ఉపేందర్, వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, బానాల రాంరెడ్డి, బిక్షం, గరికె ఉపేందర్, హన్మంతరావు, నిర్మల, మారం లింగారెడ్డి, మారేపల్లి నాగరాజు, ప్రకా శ్, రాముడు, అనిల్, విజయ్, రాజకుమార్, లింగం శ్రీనివాస్, విజయ్ కుమార్, కిరణ్ కుమార్, కేశవ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
అందరూ మొక్కలు నాటాలి
జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణణకు ప్రతీఒక్కరు మొక్కలు నాటడంతోపా టు సంరక్షించాలని ఎన్‌జీసీ కో ఆర్డినేటర్ అంజన్‌కుమార్ కోరారు. ఎన్టీపీసీ టీటీఎస్ జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఆయన మొక్కలు టారు. నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్–2025 పోటీల రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 27 వరకు పొగించారని తెలిపారు.
జీడీకే–11 గనికి గుర్తింపు
గోదావరిఖని: సింగరేణి సంస్థలోనే జీడీకే–11 గనికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ అండ్ ఎం డై రెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జీ డీకే–11గనిని సందర్శించి దుర్గామాత అమ్మ వారి ఆలయంలో పూజలు చేశారు. కొత్త టెక్నాలజీతో కంటిన్యూస్ మైనర్ ద్వారా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కన్నా అధిక ఉత్పతి సా ధించి రికార్డ్ సృష్టించారన్నారు. ప్రస్తుతం రెండు కంటిన్యూస్ మైనర్లు ఉండగా త్వరలో మూ డోది కూడా ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈనెలాఖరున ఉద్యోగవిరమణ చేసే డైరెక్టర్‌ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జీఎం లలిత్‌కుమార్, ఏజెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరణ