
తరచూ నేరాలు చేస్తే ‘గ్యాంగ్ ఫైల్స్’ ఓపెన్
గోదావరిఖని: తరచూ నేరాలు చేస్తే గ్యాంగ్ ఫై ల్స్ ఓపెన్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. పోలీస్ క మిషనరేట్‌లో శుక్రవారం పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో జూలైకి సంబంధించి న నేరసమీక్ష నిర్వహించారు. అందుబాటులోని టెక్నాలజీ, శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ కేసు ల దర్యాప్తు చేపట్టాలన్నారు. మహిళలపై జరిగే నే రాలు, కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా చేట్టాల ని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అ న్నారు. పలువురు అధికారులకు ప్రశంసాపత్రా లు అందజేశారు. డీసీపీలు భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్ పాల్గొన్నారు. ఇటీవ ల మృతి చెందిన ఏఎస్సై వెంకటరెడ్డి కుటుంబానికి రూ.8లక్షల విలువైన భద్రత చెక్కును మృతుడి భార్య శ్రీలతకు సీపీ అందజేశారు.