‘డిజిటల్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

May 21 2025 12:11 AM | Updated on May 21 2025 12:11 AM

‘డిజి

‘డిజిటల్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లిరూరల్‌: జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీఈఈటీ పనితీరుపై పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. నిరుద్యోగుల కు వారథిగా పనిచేసేందుకే ప్రభుత్వం డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటిరకు 1,810 మంది యువత ఉపాధిఅవకాశాల కో సం తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పే ర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు తమ పేర్ల ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. దీనిద్వారా యువతకు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వారి నైపుణ్యాల ఆధారంగా అర్హతగల ఉద్యోగాలను పొందవచ్చన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి కీర్తికాంత్‌, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

జ్యోతినగర్‌(రామగుండం): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఎన్టీపీసీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రెండువారాల పాటు నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. చదువుతో విజ్ఞానం, క్రీడలతో ఆరోగ్యం చేకూరుతాయన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులు ప్రావీణ్యం సాధించా లని ఆయన సూచించారు. స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అలొక్‌ కుమార్‌ త్రిపాఠి, జీఎంలు ముఖుల్‌ రాయ్‌, కేసీ సింఘరాయ్‌, ఏజీఎం బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌, అధికారుల సంఘం అధ్యక్షుడు మహేంద్రకుమార్‌, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేముల కృష్ణయ్య, ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్‌, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి గణేశ్వర్‌ జడ్డీ, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్లకార్డులతో నిరసన

రామగుండం: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక రైల్వే ఆర్‌వోహెచ్‌ షెడ్డు ప్రాంగణంలో రైల్వేకాంట్రాక్టు కార్మికులు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సమ్మెహక్కు హరిస్తూ, పని గంటలు పెంచుతూ, కనీస వేతనాలు, చట్టాలు అమలు చేయకపోవడం శోచనీయమని కార్మికులు అన్నారు. సర్కారు విధానాలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు, నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామాచారి, నాయకులు భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, రైల్వే కాంట్రాక్టు కార్మికులు కలవేణి తిరుపతి, మురళి, రాజమౌళి, సతీశ్‌, శివనాయక్‌, రాజు, ఇఫ్తాకార్‌, లాలూనాయక్‌ తదితరులు ఉన్నారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీని విస్తరిద్దాం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను విస్తరించేందుకు మండలాల వారీగా సభ్యుల సంఖ్య పెంచుదామని రెడ్‌క్రా స్‌ సొసైటీ జిల్లా కన్వీనర్‌ కావేటి రాజ్‌గోపాల్‌ అన్నారు. పెద్దపల్లిలో మంగళవారం జరిగిన జి ల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రత్నాపూర్‌లో పేదకుటుం చేపట్టిన ఇంటి పనులకు సభ్యులు సాయం అందించాలని సూ చించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశు ధ్య అవసరాల కోసం ఫినాయిల్‌ మాప్స్‌, డస్ట్‌బిన్‌, చీపుర్లు, గ్లౌసెస్‌ను సూపరింటెండెంట్‌ శ్రీధర్‌కు అందించారు. ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌ ఉన్నారు.

‘డిజిటల్‌’ సేవలు   సద్వినియోగం చేసుకోవాలి 1
1/2

‘డిజిటల్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

‘డిజిటల్‌’ సేవలు   సద్వినియోగం చేసుకోవాలి 2
2/2

‘డిజిటల్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement