తాగునీటికి సమస్యలు రావొద్దు
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. కాల్వశ్రీరాంపూర్, ఓదె ల ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఆ యన మాట్లాడారు. పారిశుధ్యం మెరుగుపర్చాలన్నారు. సిగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మీకంపోస్టు తయారీ, పీఎం విశ్వకర్మ, తడి, పొడి చెత్త విక్రయాలు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సమ్మె నోటీస్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారంలో ఈనెల 20న చేపట్టే సమ్మైపె కార్మిక సంఘాల జేఏసీ నాయకులు యాజమాన్యానికి నోటీసు అందజేశారు. సార్వ త్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ గురువారం ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యానికి కార్మిక సమ్మె నోటీసు అందజేసింది. ఆర్‌ఎఫ్‌సీ ఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయు నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకోవాలని హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య సూచించా రు. హౌసింగ్‌ఽ అధికారులతో కలిసి గురువారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ లబ్ధిదారుల ను కలిశారు. వారిని అడిగి వివరాలు సేకరించారు. నిబంధనలకు లోబడి ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. ఎంపీవో అనిల్‌రెడ్డి, హౌసీంగ్ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
కవయిత్రికి పురస్కారం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సహజ కవయిత్రి బొమ్మిదేని రాజేశ్వరికి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో గురువారం తెలుగు భాషా చైతన్య సమితి 12వ వార్షికోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ సదస్సులో ‘తెలుగు వెలుగు.. తెలుగు నామాట’ కవితను ఆలపించిన రాజేశ్వరి.. సభికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను నిర్వాహకులు తదితరులు సత్కరించారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎలిగేడు(పెద్దపల్లి): భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం అమలులోకి వచ్చిందని అడిషనల్ కలెక్టర్ వేణు తెలిపారు. లాలపల్లి, నర్సాపూర్‌లో చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను ఆయన గురువారం తనిఖీ చేశా రు. లాలపల్లి 69, నర్సాపూర్‌లో 50 దరఖా స్తులు వచ్చాయని తహసీల్దార్ బషీరొద్దీన్ తెలిపారు. ఆర్‌ఐ జయలక్ష్మి పాల్గొన్నారు.
25న ఈతపోటీలు
గోదావరిఖనిటౌన్: తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2025 కమ్ సెలక్షన్ ట్రయల్స్ స్విమ్మింగ్ పోటీలు ఈనెల 25న నిర్వహిస్తారని అసోసియేషన్ కోశాధికారి టి.కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో ప్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, సీతాకోకచిలుక, వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్‌లు ఉంటాయన్నారు. స్విమ్మర్స్ గరిష్టంగా 5 ఈవెంట్‌లలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ యూఐ డీ ని కలిగి ఉండాలని, ఈనెల 20వ తేదీలోగా త మ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, ఎంట్రీ ఫీజు రూ.100 చెల్లించాలని ఆయన వివరించారు.
తాగునీటికి సమస్యలు రావొద్దు
తాగునీటికి సమస్యలు రావొద్దు
తాగునీటికి సమస్యలు రావొద్దు


