16 పోస్టులు.. 1726 దరఖాస్తులు
● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ● ఆశ్రమాలు, ఓల్డేజ్ హోమ్‌లో ఖాళీల భర్తీకి చర్యలు
పెద్దపలి: జిల్లాలోని వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్, దివ్యాంగ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన డిస్ట్రిక్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిన ఎంపిక చేస్తామని ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువ, దరఖాస్తులు అధికంగా ఉండడంతో స్క్రీనింగ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సుల్తానాబాద్‌లో ఓల్డ్ ఏజ్ హోమ్
జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. సుల్తానాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వయోవృద్ధుల కేంద్రంలో వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీచేసే 16 పోస్టులకు 1,726 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఉద్యోగాల వివరాలు..
సంబంధిత అంశాల్లో అర్హలతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇందులో సోషల్ వర్కర్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, కేస్ వర్కర్, పోస్ట్ టైటిల్, సూపరింటెండెంట్, పవర్ ఆఫ్ మెడికల్ స్టాఫ్, స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, హోమ్ కో ఆర్డినేటర్, విజిట్ డాక్టర్, సోషల్ వర్కర్ కం అసిస్టెంట్ హోమ్ కో ఆర్డినేటర్, యోగా థెరపిస్ట్ ఉద్యోగాలు భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పో స్టు ను బట్టి నెలకు రూ.4,000 నుంచి రూ.22,750 వే తనం చెల్లిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య ఏజెన్సీ అ ర్హులను ఎంపిక చేస్తుందని అధికారులు తెలిపారు.
ఉద్యోగాల ఇప్పిస్తామంటూ..
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఉద్యో గాలు పెట్టిస్తామని రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. డబ్బులు ఇస్తే ఉద్యోగం మీదేనని జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళారులు నిరుద్యోగులకు ఆశ చూపుతున్నట్లు తెలిసింది. నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు.. అధికార పార్టీతోపాటు అధికారులు సైతం తాము చెప్పినట్టే వింటారని, ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని నమ్మబలుకుతూ నిరుద్యోగుల నుంచి సొమ్ము భారీగా వసూలు చేస్తున్నట్లు నిరుద్యోగులు చెబుతున్నారు.


