రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● జిల్లాలో ‘అరైవ్ .. అలైవ్’ ప్రారంభం ● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణ ల క్ష్యంగా అరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టామని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తె లిపారు. రోడ్డు భద్రతపై రూపొందించిన అరైవ్ .. అలైవ్ ప్రచార పోస్టర్‌ను ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి తన కార్యాలయంలో గురువారం సీపీ ప్రారంభించారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రై వింగ్, సిగ్న ల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలు రో డ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నా యని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులు.. యువతకు అవగాహన..
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం స రికాదన సీపీ అన్నారు. మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తామన్నారు. రా త్రివేళ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చలికాలంలో దట్టమైన పొగమంచుతో రహదారులు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతివేగం, ఓవర్‌టేక్ చేయకుండా జాగ్రత్త వహించాలని, సూచించారు. తప్పనిసరిగా లో బీమ్ హెడ్‌లైట్లనే ఉపయోగించాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నిర్దిష్ట వేగంతో వాహనాలు నడపడం ద్వారా స్కీడింగ్‌ను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని, పెద్దపల్లి ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


