ఆలయానికి స్థల పరిశీలన
మంథని: టీటీడీ ఆలయ నిర్మాణ ప్రతిపాదనల కోసం కలెక్టర్ కోయ శ్రీహర్ష పట్టణంలో గురువారం పర్యటించారు. లక్కేపూర్ శివానిగూడెంగుట్ట ప్రాంతాన్ని సందర్శించారు. కలెక్టర్ మా ట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో దేవాలయం, కల్యాణ మండపం నిర్మించేందుకు అనువైన స్థలాలు పరిశీలించామ న్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ ఆరిఫొద్దీన్ పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు ను కలిసి న్యూఇయర్ గ్రీటింగ్స్ అందించారు.
సావిత్రీబాయికి నివాళి
ధర్మారం(ధర్మపురి): సంఘ సేవకురాలు సావిత్రీబాయి పూలే మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారని కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సా ధన సమిఇ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వా మి అన్నారు. స్థానిక బుద్ధ ఫంక్షన్‌హాల్‌లో గురువారం బహుజన నాయకులతో సమావేశం ఏ ర్పాటు చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వామి మాట్లాడు తూ, మహిళలు విద్యను అభ్యసించి అన్నిరంగాల్లో రాణించేందుకు ఆమె చేసిన కృషి ఫలతమేనన్నారు. నాయకులు కాంపెల్లి పోచయ్య, తోడేటి రాజలింగయ్య, సుంచు మల్లేసం, చొ ప్పదండి మల్లేశం, నేరువట్ల రాజయ్య, నూనె వెంకటి, మామిడిపల్లి సంతోష్, స్వామి, వినయ్, నేరువట్ల మధు, భూక్య తిరుపతినాయక్, అజ్మీర రాజ్యనాయక్, రాజేశం పాల్గొన్నారు.
షూటర్‌కు సన్మానం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మీర్జంపేట గ్రా మానికి చెందిన షూటర్ ఎలగందులసాయి ప్ర ణవిని స్థానిక ఏఎంసీ కార్యాలయంలో గురువారం సన్మానించారు. తమిళనాడు ఈరోడ్‌లో డిసెంబర్ 27, 28వ తేదీల్లో ఇర్వహించిన ‘ఫస్ట్ ఓఫెన్ నేషనల్ మల్టీ టార్గెట్ బెంచ్ రెస్ట్ షూటింగ్ అండర్–17’లో ఆమె మూడోస్థానం సాధించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొ న్న వారిలో మనరాష్ట్రం నుంచి సాయిప్రణవి పాల్గొని కాంస్య పతకం సాధించడంతో ఆమె ను సన్మానించి, తల్లిదండ్రులు మాధురి –శేఖర్‌ను అభినందిచారు. మాజీ ఎంపీపీ సార య్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్‌చైర్మన్ సబ్బని రాజమల్లు, సర్పంచులు పి.శైలజ, ఆరెల్లి రమేశ్, బంగారి రమేశ్, జిన్న రాంచంద్రారెడ్డి, గాజుల మోహన్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
రామగుండం: ఎన్టీపీసీ ఆర్యవైశ్య భవన్‌లో గు రువారం ఆర్యవైశ్య మహిళా సంఘం కార్యవర్గాన్ని అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ ప్రకటించారు. సంఘం అధ్యక్షురాలుగా పప్పుల ప్రియాంక, ప్రధాన కార్యదర్శిగా అల్లాడి కళావతి, కోశాధికారిగా రావికంటి హరిత, గౌరవ అ ధ్యక్షురాలుగా రావికంటి అంజలి, ఉపాధ్యక్షు రాలుగా పైడ అపూర్వ, అదనపు కార్యదర్శిగా నార్ల హరిప్రియను ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, పైడ సాయికుమార్, కాసనగొట్టు నాగరాజు పాల్గొన్నారు.
‘ధూపదీపం’లోకి మరో 24 ఆలయాలు
మంథని/కమాన్‌పూర్: మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 24 ఆలయాలు ధూపదీప నైవేద్యం పథకం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు గురువారం తెలిపారు. మంథని, కమాన్‌పూర్, రామగిరితోపాటు తూర్పు మండలాల్లోని పలు ఆలయాలకు నిధులు మంజూరు చేశారు. వాటిని త్వరలో సందర్శించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆలయానికి స్థల పరిశీలన
ఆలయానికి స్థల పరిశీలన


