
క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రతిభగల క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. క్రీడలతో శారీరక అభివృద్ధితోపాటు, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఖోఖో, వాలీబాల్ వేస వి శిక్షణ శిబిరాలను ఎ మ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, ప్రతినిధులు గాజుల రాజమల్లు, సాయిరిమహేందర్, ముస్త్యాల రవీందర్, అమీరిశెట్టి తిరుపతి, చిలుక సతీశ్, అబ్బయ్య, రాజయ్య, రాజలింగం, గెల్లు మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.