
అధికార పార్టీ నేతలే బెదిరిస్తున్నారు
గోదావరిఖని: రామగుండంలో పాలన గాడితప్పిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ జాఫర్ జమానా కానవస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరించి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీడియాకు కూడా రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అంతర్గాం తహసీల్దార్‌పై కాంగ్రెస్ నేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, ఒక ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన డీఎంహెచ్‌వోను కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం సరైంది కాదని అన్నారు. తమ హయాంలో వైద్యులకు అండగా నిలిచామన్నారు. ఓ పిల్లల వైద్యుడిపై దాడి చేయించి ఇక్కడ నుంచి వెళ్లగొట్టిన చరిత్ర ఉన్న రాజ్‌ఠాకూర్.. ఎమ్మెల్యేగా గెలిచాక మెడికల్ హబ్ అంటూ, డాక్టర్లకు అండగా ఉంటానని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిండచమేనన్నారు. రామగుండంలో సింగరేణి ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇప్పటికై నా పాలనపై దృష్టి సారించి, అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, గాధం విజయ, నడిపెల్లి మురళీధర్‌రావు, ముద్దసాని సంధ్యారెడ్డి్, నూతి తిరుపతి, పిల్లి రమేశ్, జక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈదురుగాలుల బీభత్సం
పాలకుర్తి(రామగుండం): గురువారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి వివిధ గ్రా మాల్లో వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరిపైరు నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బసంత్‌నగర్ స్టాఫ్‌కాలనీలో పెద్ద చెట్టు క్వార్టర్‌పై విరిగి పడటంతో గోడలు కూలింది. ఇంటిముందు రేకులషెడ్డు, కారు ధ్వంసమయ్యాయి.

అధికార పార్టీ నేతలే బెదిరిస్తున్నారు