
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి
పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనుసరించాల్సిన పద్ధతులపై పంచాయతీ, వైద్య, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం ఆమె సమావేశమై పలు సూచనలు చేశా రు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో కరోనా ప్రబలుతోందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని ఆమె సూచించా రు. సమావేశంలో జిల్లా అధికారులు వీరబుచ్చ య్య, శ్రీనివాస్, శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌తోపాటు మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.