పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
పెద్దపల్లిరూరల్: పట్టణాన్ని అభివృద్ధి చేయడంపై అధికారులు శ్రద్ధ చూపాలని బీజేపీ నాయకులు పల్లె సదానందం, శివంగారి సతీశ్ కోరా రు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవా రం పార్టీశ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన ని ర్వహించారు. అంతర్గత రోడ్లను అభివృద్ధి చే యాలని, ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మండి బిర్యానీ సెంటర్లలో శుభ్రత లోపించిందనిఆరోపించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకు లు భాస్కర్, రాజు, సాయికృష్ణ, శ్రీనివాస్, నరే శ్, రాజేశం, క్రాంతి, మనోహర్, విజయ్, కృష్ణ, అభి, అఖిల్, సందీప్, వెంకటేశ్, సోడాబాబు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల భవిష్యత్‌కు చేయూత
జ్యోతినగర్(రామగుండం): బాలికల ఉజ్వల భవిష్యత్‌కు ఎన్టీపీసీ చేయూతనిస్తోందని ఆ సంస్థ సంయుక్త మహిళా సమితి సీనియర్ స భ్యురాలు సునీత జైకుమార్ శ్రీనివాసన్, దక్షిణ దీపాంజలి మహిళా సమితి అధ్యక్షురాలు రంజ నా దువా అన్నారు. సీఎస్సార్ ఆధ్వర్యంలో బా లికలకు నెలరోజులపాటు అందించే రెసిడెన్షియల్ శిక్షణ శిబిరాన్ని వారు బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, కరాటే పోటీలు, స్కిట్‌లు ఆక ట్టుకున్నాయి. ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి అ ధ్యక్షురాలు రాఖీ సామంత, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు.
రజకులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పెద్దపల్లిరూరల్: సంక్షేమ పథకాల్లో రజకులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇనివ్వాలని ఆ సంఘం జి ల్లా అధ్యక్షుడు రమేశ్, అధికార ప్రతినిధి అలువాల రాజేందర్ డిమాండ్ చేశారు. రజక సంఘం జిల్లా ప్రచార కార్యదర్శిగా ప్రణయ్, ని యోజకవర్గ ఇన్‌చార్జిగా వెంకటేశ్‌ను నియమించగా.. బుధవారం వారికి జిల్లా కేంద్రంలో ని యామక పత్రాలు అందించారు. అంతకుముందు పట్టణంలో చేపట్టే మడేలయ్య బోనాల జా తరకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే దా సరి మనోహర్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించా రు. మల్లేశ్, ఉప్పలయ్య, రామ్మూర్తి, సురేశ్, రమేశ్, నవీన్, కుమారస్వామి పాల్గొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
సుల్తానాబాద్‌రూరల్: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఏ సీపీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అంబేడ్కర్ చౌ రస్తా, పూసాల రోడ్డు, బస్టాండ్ ఏరియాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఏసీపీ మా ట్లాడుతూ రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు నియంత్రణ చర్యలు తీ సుకుంటున్నామన్నారు. అవసరమైనచోట ట్రా ఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపా రు. సీఐలు అనిల్, సుబ్బారెడ్డి ఉన్నారు.
పంట పరిహారం విడుదల
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో యాసంగి సాగు సమయంలో అకాల వర్షం, వడగళ్ల వానతో పంట లు నష్టపోయిన రైతులకు బుధవారం ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాలవర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసిన వ్యవసాయ శా ఖ.. జిల్లాలో 3,556 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దానికి సంబంధించిన 3,297మంది రైతులకు సుమారు రూ.3.567 కోట్ల పరిహారం విడుదల చేయడంతో నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి


