సుల్తానాబాద్
జిల్లాలో గాడితప్పిన చెత్త సేకరణ ఆదాయంపై కానరాని చిత్తశుద్ధి కాగితాల్లోనే డంపింగ్ యార్డుల ఆధునికీకరణ చెత్త సేకరణకు ప్రతీనెల రూ.లక్షల్లో వెచ్చిస్తున్న వైనం అయినా మున్సిపాలిటీల్లో మెరుగుపడని పారిశుధ్యం బల్దియాల్లో జాడలేని బయోమైనింగ్ కేంద్రాలు
రామగుండం
7.5
చెత్త
35
7
95
70
130
80,000
616
15,000
6,000
(లక్షలు)
2.10
(రోజుకు)
17
12
(నెలకు)
29
73
పెద్దపల్లి
మంథని
సాక్షి,పెద్దపల్లి/కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం నగరంలో ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ప్రచారానికే పరిమతమవుతోంది. ప్రతినెలా రూ.లక్షలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో చెత్తసేకరణ సజావుగా సాగడం లేదు. ప్రధానంగా చెత్త సేకరణకు వాహనాల కొరత ఆటంకంగా మారుతోంది. ఒకేవాహనంలో తడి, పొడిచెత్త కలిపి తరలించడం విస్మయం కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేక నిబంధనలు అమలు కావడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఆదాయంపై చిత్తశుద్ధి ఏది?
బల్దియాల్లో తడిచెత్తతో కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, పొడిచెత్త(ఘన)తో బయోమైనింగ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నా బల్దియాలకు చిత్తశుద్ధి కరువైంది. రామగుండంలో దశాబ్దాకాలం క్రితమే తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నా.. ప్రయోజనం లేకుండాపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగానే మారాయి.
రోజూ 179.5 మెట్రిక్ టన్నుల చెత్త
జిల్లాలో రోజూ సుమారు 179.5 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్త సేకరిస్తున్నారు. రామగుండం నగరంలో రోజూ సుమారు 130 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 35 మెట్రిక్ టన్నులు, మంథనిలో 7 మెట్రిక్ టన్నులు, సుల్తానాబాద్‌లో 7.5 మెట్రిక్ టన్నులు వెలువడుతోందని అధికారులు తెలిపారు.
మొక్కుబడిగా చెత్త సేకరణ..
తడి, పొడి చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోందని విమర్శలు ఉన్నాయి. రామగుండంలో వెలువడే 130 మెట్రిక్ టన్నుల చెత్తలో 2 టన్నుల వరకు పొడి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆ లెక్కలకు పొంతన కుదరడం లేదు. మిగతా బల్దియాల్లోనూ మొక్కుబడిగా సాగుతోంది.
డీఆర్‌సీసీలపై నిర్లక్ష్యం
డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ల(డీఆర్‌సీసీ) నిర్వహణపై బల్దియాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. ఇక్కడి గౌతమినగర్‌లోనే ఒక డీఆర్‌సీసీ వినియోగంలో ఉంది. నాలుగు నెలల క్రితం రూ.83లక్షల వ్యయంతో గోదావరి తీరంలోని డంపింగ్ యార్డులో డీఆర్‌సీసీకి ప్రత్యేక భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ భవనం ఫిల్లర్ల దశలోనే ఉంది. డీఆర్‌సీసీలు అందుబాటులోకి వస్తే.. ఇంటింటా చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆదాయం కూడా లభిచనుంది. కిలో ప్లాస్టిక్‌కు రూ.16, పేపర్‌కు రూ.8, గాజు సీసాకు రూ.3 చొప్పున డీఆర్‌సీసీ నిర్వాహకులు చెల్లిస్తున్నారు.
రూ.లక్షల్లో ఖర్చు.. అయినా రాని మార్పు
చెత్త సేకరణకు బల్దియాలు ప్రతీనెల రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నాయి. పారిశుధ్యం నిర్వహణలో మార్పు అయితేరావడం లేదు. రామగుండంలో పీహెచ్ వర్కర్లు 44 మంది, 448 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, 124 మంది ర్యాగ్ పిక్కర్లు పని చేస్తున్నారు. చెత్త సేకరణకు 14 ట్రాక్టర్లు, 59 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ఒక కంపాక్టర్ వాహనం ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగానికి రోజూ సుమారు రూ.80వేల విలువైన ఇంధనం వినియోగిస్తున్నారు.
జాడలేని బయోమైనింగ్
బల్దియాల్లో తడిచెత్తతో మొక్కుబడిగా కంపోస్టు తయారు చేస్తున్నారు. రామగుండంలో ప్రతీరోజు మార్కెట్‌లో పడేసిన వ్యర్థాలతోపాటు పూలవ్యాపారులు, దేవాలయాల నుంచి వెలువడే వ్యర్థాలు సుమారు 2టన్నులను గౌతమినగర్ డీఆర్‌సీసీకి తరలించి కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించడానికి నిల్వ చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌నూ కంపోస్టును తయారు చేస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతోందని తెలుస్తోంది. ఎక్కడా బయోమైనింగ్‌పై దృష్టి సారించిన దాఖలాలే లేవు. పెద్దపల్లిలో ఓ ఏజెన్సీకి పనులు అప్పగించారు.


