రకైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి: క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్‌హాల్లో బుధవారం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకు ఆయన హాజరై మాట్లాడారు. చర్చిల అభివృద్ధికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను తెలియజేస్తుందని అన్నారు. అనంతరం కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, మైనారిటీ సంక్షేమ శాఖ సీనియర్ సహాయకుడు అప్షానా అబ్రార్, తహసీల్దార్లు, రాజయ్య, బషీరుద్దీన్ తదితరులు ఉన్నారు.
క్రీడాస్పూర్తి చాటాలి
పెద్దపల్లిరూరల్: క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందించేలా ఉండాలని, క్రీడాస్ఫూర్తితో ముందు కు సాగేలా ఆలోచన చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం పెద్దపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఆసక్తిఉన్న క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు. వచ్చే ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్‌ను రప్పిస్తానని ఆయన అన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, నాయకులు మల్లన్న, జడల సురేందర్, మస్రత్, రాజగోపాల్, మంథని నర్సింగ్, బండి అనిల్, జగదీశ్, సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


