చర్యలు చేపడతాం
రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్లాన్ సిద్ధం చేస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్–2025 –26లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు మంచి ర్యాంక్ సాధించేలా కార్యక్రమాలు చేపడతాం. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బయోమైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మంథనిలో కూడా డీఆర్‌సీసీ నిర్మాణ దశలో ఉంది. అన్ని మున్సిపాలిటీల్లో తడిచెత్తతో ఎరువులు తయారు చేయిస్తున్నాం.
– అరుణశ్రీ, అదనపు కలెక్టర్


