అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి: వినియోగదారు కొనుగోలు చేసే ప్ర తీవస్తువుకు రసీదు తీసుతీసుకోవాలని అదన పు కలెక్టర్ వేణు సూచించారు. బుధవారం జా తీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో క లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వే ణు మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న వస్తుసామగ్రి ఎంపిక చేసుకోవాలని సూచించారు. మోసపోతే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం పరిహారం పొందవచ్చని అన్నారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా ఈఏ డాది సమస్యలు త్వరితగతిన పరిష్కారం అ వుతున్నాయని తెలిపారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు కె.ప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చేతన సోనీ, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ పాల్గొన్నారు.
28న బోనాల శోభాయాత్ర
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం):యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర నిర్వహిస్తామని ఆ సంఘం అడక్ కమిటీ అధ్యక్షుడు గడ్డం తి రుపతి యాదవ్ తెలిపారు. ఉత్సవ సమితి క మిటీ సభ్యులతో కలిసి మల్లన్నస్వామి బోనా ల శోభాయాత్ర ప్రచార పోస్టర్‌ను బుధవారం పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. మా రం మల్లేశ్‌యాదవ్, చెప్ప మల్ల య్య యాదవ్, సాంబమూర్తి యాదవ్, పాశం ఓదెలు యాద వ్, కట్ల సత్యం యాదవ్, ఆవులు రాజేశ్ యాద వ్, రేశవేణి కేశవులు యాదవ్, గొ డుగు రమేశ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శంకర్ ఉన్నారు.
కుష్ఠు నివారణకు చర్యలు
పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్: కుష్ఠు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాల ని లెప్రసీ సర్వే రాష్ట్ర పరిశీలకురాలు సుజాత సూచించారు. 2027 మార్చి 31వ తేదీ వరకు నిర్దేశిత లక్ష్యం సాధించాలన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన లెప్రసీ సర్వేను బు ధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ నంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. కుష్ఠును ప్రారంభదశలోనే గుర్తిస్తే నయం చేయొచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు వాణిశ్రీ, సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, కిరణ్‌కుమార్, ఉదయ్‌కుమార్, డీపీఎంవోలు దేవిసింగ్, రమేశ్, గర్రెపల్లి ఎంఎల్‌హెచ్‌పీ సంతోష్, ఏఎన్‌ఎంలు శోభన, తబాస పాల్గొన్నారు.
14రోడ్లు.. రూ.49.93కోట్లు
మంథని/కమాన్‌పూర్: పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని 14 రోడ్ల నిర్మాణానికి రూ.43.93 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయం ప్రకటించింది. మంథని మండలం చిన్నఓదాల నుంచి మానేరు వరకు రూ.కోటి, పీడబ్ల్యూడీ రోడ్డు– విలోచవరం – మంథనిలోని అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుంచి మల్లేపల్లి వరకు రూ.1.82 కోట్లు, గుమునూరు పీడబ్ల్యూడీ రో డ్డు నుంచి కాకర్లపల్లి – దంతలపల్లి వరకు రూ.3.75 కోట్లు మంజూరు చేశారు. ముత్తారం, కమాన్‌పూర్, కాటారం, మల్హర్, మహదేవపూర్ మండలాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలి
పెద్దపల్లి: పింఛన్‌దారులందరికీ రిటైర్డ్ బెని ఫి ట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పింఛన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లా చైర్మ న్ లక్ష్మయ్య కోరారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను టీపీటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాదాసి సార య్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. లక్ష్మ య్య తదితరులు మాట్లాడారు. నాయకులు సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణ, రవీందర్రావు, దామోదర్‌రెడ్డి, నంబయ్య, మొగిలి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
జాతర పనులు ప్రారంభం
రామగుండం: గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ బుధవారం ప్రారంభించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి


