సింగరేణిలో డ్రై వాషరీష్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో డ్రై వాషరీష్‌

Dec 25 2025 10:22 AM | Updated on Dec 25 2025 10:22 AM

సింగరేణిలో డ్రై వాషరీష్‌

సింగరేణిలో డ్రై వాషరీష్‌

కేంద్ర మంత్రి ఆదేశంతో అప్రమత్తం

ఆలోచనలో సింగరేణి యాజమాన్యం

నాణ్యమైన బొగ్గు కోసమే నిర్ణయం

గోదావరిఖని: సింగరేణిలో బొగ్గును శుద్ధి చేసే డ్రైవాషరీష్‌ ప్రారంభం అవుతాయా? గతంలో నీటిద్వారా వెట్‌ వాషరీష్‌ కొనసాగగా, ప్రస్తుతం వాటిని మూసివేశారు. వినియోగదారులకు నాణ్యమైన బొ గ్గు అందించాలనే లక్ష్యంతో ఉత్పత్తి అవుతున్న బొగ్గును డ్రైవాషరీష్‌లో శుభ్రం చేసి వినియోగదారులకు అందిస్తే వారిని కాపాడుకోవడం ద్వారా సంస్థకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదేవిషయంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించిన క్రమంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో డ్రైకోల్‌వాషరీష్‌ ఏర్పాటు చేసుకోవాలని, నాణ్యమైన బొగ్గును విద్యుత్‌ సంస్థలకు అందిస్తే ధర ఎక్కువగా పలకడంతో పాటు విద్యుత్‌ సంస్థలకు లాభాలు అధికంగా వచ్చే అవకాశాలుంటాయని సూచించారు. మట్టి, ఇతర పదార్థాలు, షేల్‌బొగ్గు వేరు చేసేందుకు డ్రైవాషరీష్‌ను ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈవిధానం ప్రస్తుతం మనదేశంలో వినియోగం లేనట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.

సింగరేణిలో గతంలో వెట్‌కోల్‌వాషరీస్‌

సింగరేణి సంస్థలో దశాబ్దం క్రితం వరకు వెట్‌కోల్‌వాషరీస్‌ కొనసాగాయి. బొగ్గు గనుల నుంచి వెలుబడిన బొగ్గును చిన్నముక్కలుగా కట్‌చేసి నీటితో శుభ్రం చేసి విద్యుత్‌ సంస్థలకు అందించే విధానం కొనసాగింది. అయితే ఈవిధానం వల్ల బొగ్గును కడిగిన మల్మ(బొగ్గుబురద) పంపించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగింది. అంతేకాకుండా బొగ్గు బురదనీటిని శుద్ధిచేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. పర్యావరణానికి ఎక్కువ గా హాని కలుగుతుండటంతో పర్యావరణ శాఖ అనుమతులు కఠినతరం చేసింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్‌వాషరీష్‌ను మూసివేశారు.

డ్రైవాషరీస్‌కు అనుమతి సులభతరం

నీటితో బొగ్గును శుభ్రపర్చే విధానం కన్నా గాలితో బొగ్గును శుభ్రపర్చి నాణ్యమైన బొగ్గును వేరుచేసే విధానానికి పర్యావరణ శాఖ అనుమతులు సులభతరంగా ఉన్నాయి. దీంతో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దీనిపై దృష్టి సారించాలని సూచిస్తోంది. ప్రస్తుతానికి మనదేశంలో డ్రైవాషరీల్‌ ప్రస్తుతం లేవని, విదేశాల్లో మాత్రం కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈక్రమంలో సింగరేణి ఈవిధానం పాటిస్తే బెటర్‌ అంటున్నారు.

బొగ్గు డ్రైవాషరీష్‌ విధానం ఇలా

నీళ్లు ఉపయోగించకుండా, గాలి, వైబ్రేషన్‌, గ్రావిటీ ఆధారంగా బొగ్గులోని మట్టి, రాళ్లు, పనికిరాని పదార్థాలను వేరు చేయడం. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు సరఫరా కోసం ఈబొగ్గును ఎక్కువగా వాడుతారు. గనుల నుంచి వచ్చిన బొగ్గును ముందుగా క్రషర్‌లో వేసి చిన్నసైజ్‌లుగా చేస్తారు. సాధారణంగా 6 ఎం. ఎం. నుంచి 50ఎం.ఎం. మందంగా చేస్తారు. సరైన సైజ్‌లేకపోతే డ్రైవాషింగ్‌ పనిచేయదు. వైబ్రేటింగ్‌ స్క్రీన్లతో బొగ్గును వేర్వేరు సైజ్‌లుగా వడపోస్తారు. మూడు విభాగాలుగా తయారు చేస్తారు. ఫైన్‌కోల్‌, మీడియం కోల్‌, కోర్స్‌ కోల్‌ విభజిస్తారు.

ఎయిర్‌ డెన్సిటీ సెపరేషన్‌..

ఎయిర్‌ డెన్సిటీ సెపరేషన్‌ డ్రైవాషరీలో ముఖ్యమైన దశ. బొగ్గును ఎయిర్‌టేబుల్‌, ఎయిర్‌ ఫ్లూయిడైజ్డ్‌ బెడ్‌మీద వేస్తారు. కింద నుంచి బలమైన గాలి ప్రవాహం వదులుతారు. బరువు తక్కువ బొగ్గుపైకి బరువు ఎక్కువ ఉన్నమట్టి, రాళ్లు కిందకు వెళ్తాయి. ఇలానే శుద్ధి(వాషింగ్‌) కొనసాగుతుంది.

వైబ్రేషన్‌, గ్రావిటీ విధానం..

టేబుల్‌ కంపనం వల్ల శుద్ధమైన కోల్‌ ఒకవైపు, మలినాలు, మట్టి ఉన్న కోల్‌ మరోవైపు వెళ్తాయి. డ్రైప్రాసెస్‌ విధానం కావడంతో దుమ్ము ఎక్కువగా వస్తుంది. దీన్ని నివారించేందుకు డస్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్లు, బ్యాగ్‌ ఫిల్టర్లు, సైక్లోన్‌ సెపరేటర్లు ఉపయోగిస్తారు. శుద్ధి చేసిన డ్రైకోల్‌ కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా స్టాక్‌ యార్డ్‌ లేదా రైల్వే సైడింగ్‌కు పంపిస్తారు.

అనేక ఉపయోగాలు

నీటి వినియోగం తక్కువ. ఆపరేటింగ్‌ ఖర్చుకూడా తక్కువే. పవర్‌ ప్లాంట్లకు సరైన గ్రావిటీబొగ్గు అందుతుంది. పర్యావరణానికి అనుకూలం ఉంటుంది. బొగ్గులో తేమశాతం పెరగదు. దీంతో సంస్థకు లా భాలు భారీగా రావడంతోపాటు పర్యావరణాకి ము ప్పు ఏర్పడకుండా ఉంటుంది. ఈక్రమంలో సింగరేణి యాజమాన్యం డ్రైకోల్‌వాషరీష్‌పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement