ప్రజలు అప్రమత్తంగా ఉండాలి● గోదావరిఖని ఏసీపీ రమేశ్
గోదావరిఖని: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జనసమ్మర్థంలోని ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతంలోని ముఖ్య ప్రాంతాల్లో బాంబ్‌స్క్వాడ్, డాడ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆదేశాలతో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్ నేతృత్వంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ , మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, కోర్ట్ పరిసరాలు, ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి ఏసీపీ మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత చర్యల్లో భాగంగా డాగ్, బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టామన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో ఎస్సైలు భూమేశ్, రమేశ్, శ్రీనివాసులు, కోటేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
18న మెగా జాబ్‌మేళా
గోదావరిఖని: ఈనెల 18 మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్‌మేళాకు హైదరాబాద్‌కు చెందిన 80 నుంచి 100 ప్రైవేటు కంపెనీలు వస్తాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతను ఎంపికచేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు, సాంకేతిక విద్య, పైచదువులు చదివిన వారు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఆర్జీ–1 జీవీటీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్‌నంబర్ 9491144252 నెంబరులో సంప్రదించాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు ఆంజనేయులు, శివనారాయణ, కర్ణ, వరప్రసాద్, డాక్టర్ అంబిక, రవీందర్‌రెడ్డి, లక్ష్మీరాజం, ధనలక్ష్మిబాయి, శ్రావణ్‌కుమార్, అశోక్‌రావు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి● గోదావరిఖని ఏసీపీ రమేశ్


