బుధవారంపేట శివారులో ఉద్రిక్తత
రామగిరి(మంథని): బుధవారంపేట గ్రామ శివారులోని ఎనిమిదో వార్డులో మిళ్లకు నంబర్లు వేసేందుకు శనివారం వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మూడు, నాలుగు రోజులుగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లకు నంబర్లు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంపేట శివారులో ఇళ్లకు నంబర్లు వేసేప్రక్రియను సింగరేణి అధికారు లు కొందరి స్వార్థపరుల సహకారంతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులను అడ్డుకు నే క్రమంలో ప్రజలను మభ్యపెట్టి విభజించే ప్రయ త్నం జరిగిందని, పోలీసు బందోబస్తు మధ్య దౌర్జ న్యంగా నంబర్లు వేశారని పేర్కొన్నారు. నడిరోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనకు దిగారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామని, కానీ తమ ఇళ్లు, తమ హక్కులు వదులుకోబోమని నినాదాలు చేశారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనా ల కోసం సింగరేణికి తొత్తులుగా మారి గ్రామ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండా చేపట్టే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకి స్తామని వారు స్పష్టం చేశారు. ఇళ్ల నంబర్ల అంశంపై అధికారుల తీరును వెంటనే మార్చుకోవాలని, ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.


