జీవో 252ను సవరించాలి
పెద్దపల్లిరూరల్: జర్నలిస్టుల హక్కుల ను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే హెచ్– 143 నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసన తెలిపా రు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అంకరి ప్రకాశ్, నా యకులు కాల్వ రమేశ్, ముద్దసాని సమ్మయ్య, ఎ ర్రోజు వేణు, తిర్రి తిరుపతి, కీర్తి రమేశ్, దొమ్మటి రాజేశ్ తదితరులతో కలిసి అడిషనల్ కలెక్టర్ వేణు కు వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్‌కార్డుల జారీవిషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకా రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపత్రికల ఉనికిని ప్ర మాదంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు ఎన్‌డీ తివారీ, అర్కుటి మల్లేశ్, చిలా రపు కిషన్, కొయ్యడ తిరుపతి, తూర్పటి శ్రీనివాస్, దుర్గం లక్ష్మణ్, తిర్రి సుధాకర్, మారుపాక అంజి, డీఎల్‌ఎన్ చారి తదితరులు పాల్గొన్నారు.


