ఘనంగా గణపతి హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయంలో శనివారం గణపతి హోమం ఘ నంగా నిర్వహించారు. రాంపల్లి వామనశర్మ ఆ ధ్వర్యంలో హోమం నిర్వహించగా, అఖిల భా రతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి, సభ్యులు సంపత్‌రావు, న డిపెల్లి రామ్‌మోహన్‌రావు, నడిపెల్లి ప్రవీణ్‌రా వు, శ్రీధర్‌స్వామి, కృష్ణస్వామి, నారాయణస్వా మి, దీక్షిత్‌స్వామి, స్వాములు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల కు చెందిన శ్రీనిజ రాష్ట్రస్థా యి హ్యాండ్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. శనివారం సిరిసిల్లలో జరిగిన ఉమ్మడి జిల్లా పోటీల్లో ఆమె ప్రతిభ కనబర్చిందన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
శిక్షణ తర్వాతే విధులు
సుల్తానాబాద్‌రూరల్: శిక్షణ ఇచ్చాకే సర్పంచు లు, ఉప సర్పంచులకు ప్రభుత్వం పాలన బా ధ్యతలు అప్పగిస్తుందని జిల్లా పంచాయతీ అ ధికారి వీరబూచ్చయ్య తెలిపారు. బొంతకుంటపల్లిని శనివారం డీపీవో సందర్శించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. కొ త్త సర్పంచులు, ఉప సర్పంచులకు సంక్రాంతి తర్వాత శిక్షణ ఇస్తామని తెలిపారు. సర్పంచ్ శ్రీరంగారావు, ఉపసర్పంచ్ సుమలత, ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
కల్వర్టులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం
మంథనిరూరల్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమి టీ చైర్మన్, మంత్రి అయిన మంథని ఎమ్మెల్యేకు ఇరుకై న కల్వర్టులను బాగుచేయాలనే ఆలోచన లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. అడవిసోమన్‌పల్లి సమీపంలో ని ఇరుకై న కల్వర్టును శనివారం ఆయన పరిశీలించిన మాట్లాడారు. సీఎంతోపాటు రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే మంథ ని ఎమ్మెల్యే.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు ఆలోచన చేయడంలేదో ప్రశ్నించాలన్నారు. నా యకులు శంకర్‌గౌడ్, కనవేన శ్రీనివాస్, పు ప్పాల తిరుపతి, కొండ రవీందర్, ప్రసాదరా వు, పెగడ శ్రీనివాస్, రాజుగౌడ్, నరేందర్, సంపత్, జంజర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న కూల్చివేతలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూ ర్ణకాలనీలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు శ నివారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మేడిపల్లి రోడ్డులోని ఓ ఇంటి ప్రహరీ అక్రమం కట్టడమని గుర్తించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు.. జేసీబీతో దానిని కూల్చి వేశారు. కొద్దిరోజులు క్రితం అన్నపూర్ణకాలనీ లో కూల్చివేతలు చేపట్టి, కొన్నిఅక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు.. వాటిని తొలగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కొందరు కూల్చివేయక పోవడంతో శనివారం కూల్చివేతలను కొనసాగించినట్లు సమాచారం. తమ ప్రహరీని కూల్చివేస్తున్న క్రమంలో బాధితురాలు రోదిస్తున్నప్పటికీ కూల్చి వేత ఆగలేదు.
హైవే పనులు అడ్డగింత
రామగిరి(మంథని): బేగంపేట పరిధిలో చేపట్టిన నేషనల్ హైవే పనులను సర్పంచ్ మంథని చంటి, వార్డు సభ్యులు శనివారం అడ్డుకున్నారు. కొత్త అండర్‌పాస్‌లను తక్కువ ఎత్తు, పొడవుతో నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా నిర్మిస్తే భారీవాహనాలు వెళ్లవని తెలిపారు. ప్రజాభద్రత, రవాణా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అండర్‌పాస్‌లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ సందెల రేణుక, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక
ఎలిగేడు(పెద్దపల్లి): సు ల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి నాగరాజు–శివజ్యోతి దంపతుల కుమారుడు అక్కినపల్లి అభిరామ్ 2026 జనవరి 26న న్యూఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే క్యాంపు(ఆర్‌డీసీ)కి ఎంపికయ్యాడు. ప్రధాని మోదీ సమక్షంలో క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి ప్రదర్శించనున్నాడు. అభిరామ్ ఎంపిక అంకితాభావం ,క్రమశిక్షణ, కఠోర శ్రమకు నిదర్శనమని గ్రామస్తులు ప్రశంసించారు.
ఘనంగా గణపతి హోమం
ఘనంగా గణపతి హోమం
ఘనంగా గణపతి హోమం


