తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు

తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు

● వనదేవతల జాతర వరకు బీటిరోడ్లు ● రూ.5.65కోట్లతో పనులు ● ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద గిరిజన దేవుళ్ల వేడుక సమ్మక్క–సారలమ్మ జాతర. ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రధాన రహదారుల నుంచి జాతర ప్రాంతం వరకు బీటీ రోడ్లు ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పె ద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. భక్తులరద్దీ అధికంగా ఉండే పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండ లం మీర్జంపేట, పెద్దరాతుపల్లి, ఓదెల మండలం కొలనూర్‌ గ్రామాల్లో వనదేవతల జాతర వరకూ బీటీ రోడ్డు నిర్మిస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం పనులు ప్రారంభించారు. జాతర వరకు రహదారులు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

రూ.5.61కోట్లతో పనులు..

పెద్దపల్లి నియోజకవర్గంలోని సమ్మక్క – సారలమ్మ జాతరలు జరిగే ఐదు ప్రధాన ప్రాంతాలకు బీటీ రోడ్డు వేసే పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61కోట్లు కేటాయించింది. ఆ నిధులతో పనులను శనివారం ప్రా రంభించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సమ్మక్క – సారలమ్మ జాతర ఉత్సవాల నాటికి రోడ్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌, ఓదెల మండలం కొలనూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట జాతర ప్రాంతం వరకు రూ.99లక్షల అంచనా వ్య యంతో బీటీ రోడ్డు పనులు చేపడతారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి వరకు రూ. 1.65కోట్లు వెచ్చిస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహించే జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తా రు. బీటీరోడ్లు అందుబాటులోకి వస్తే భక్తుల రవాణా కష్టాలు తీరుతాయి.

కాల్వశ్రీరాంపూర్‌/సుల్తానాబాద్‌రూరల్‌/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి, మీర్జంపేట, ఓదెల మండలం కొలనూర్‌లో సమ్మక్క జాతర వరకు చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతా ల్లో జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడారు. ఓదెల మండలం కొలనూర్‌ సమ్మక్క – సారలమ్మ జాతరను మేడారం తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామని తెలిపారు. సుల్తానాబాద్‌ మండలం కేజీబీవీలో అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సారయ్యగౌడ్‌, లంక సదయ్య, రామిడి తిరుపతిరెడ్డి, లత, శైలజ, మనోహర్‌రావు, కొమురయ్య, రమే శ్‌, మోహన్‌, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌, గాజన వేన సదయ్య, ఉయ్యాల వైకుంఠం, పల్లె కనుకయ్య, పిట్టల రవికుమార్‌, రంగు మల్లేశ్‌గౌడ్‌, మూల ప్రేంసాగర్‌రెడ్డి, బైరి రవిగౌడ్‌, చిన్నయ్య, రమేశ్‌గౌడ్‌, రాజిరెడ్డి, తిరుమల్‌రావు, ప్రకాశ్‌రా వు, కల్లెపల్లి జాని, సతీశ్‌, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మేడారం తరహాలో కొలనూర్‌ జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement