పెరిగిన నేరాలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన నేరాలు

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

పెరిగ

పెరిగిన నేరాలు

● గతేడాదితో పోల్చితే క్రైమ్స్‌ అప్‌ ● భారీగా ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ● ‘సైబర్‌’ బారినపడి ప్రజల విలవిల ● పలువురు మావోయిస్టుల లొంగుబాటు ● జూలై 15న సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో భార్యాభర్తల పంచాయితీ జరిగింది. ఇందులో ఇరువర్గాల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఇందులో ఇద్దరు చనిపోగా.. నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ● మంథని ప్రాంతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ● అదేవిధంగా హైకోర్టు న్యాయవాద దంపతుల కేసును సుప్రీంకోర్టు సైతం సీబీఐకి అప్పగించింది. జిల్లాలో విచారణ చేపట్టిన సీబీఐ.. సుమారు 130 మందిని విచారించింది. ● మొత్తంగా రాష్ట్రంలో నమోదైన రెండు సీబీఐ కేసులు జిల్లాకు చెందినవే కావడం వార్తల్లోకెక్కింది.

సాక్షి పెద్దపల్లి: ఏటా గుబులు పుట్టిస్తున్న నేరాలు, ఘోరాల సంఖ్య ఈసారి కూడా తగ్గుముఖం పట్టలేదు. అలాగరి గతేడాదితో పోల్చితే తీవ్రమైన నే రాలు, హత్యలు చోటు చేసుకోలేదు. ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు తగ్గినా.. సైబర్‌ నేరగాళ్ల బారినపడినవారి సంఖ్య భారీగా పె రిగింది. పలు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్‌లు తదిత ర కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. వీటితోపాటు రోడ్డుప్రమాదాలు, ఆత్మహత్యలు, మిస్సింగ్‌ కేసులు కూ డా బాగానే నమోదయ్యాయి. పోలీసుల పటిష్ట చ ర్యలతో జిల్లాలో ఈఏడాది ఎమ్మెల్సీ, గ్రామ పంచా యతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

ట్రాఫిక్‌ జరిమానాలు రూ.13కోట్లు

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన కేసలు 4,12,553 నమోదవగా. రూ.13, 67,91,645 జరిమానా విధించారు. డ్రంక్‌ డండ్‌ డ్రైవ్‌ కేసులు 9,678 నమోదు కా గా, 6,772 మందికి రూ.96,45,100 జరిమానా విధించారు. 28 కేసుల్లో చిత్తుగా మద్యం తాగిన వారికి జైలు శిక్ష విధించారు.

నెత్తురోడిన రహదారులు..

జిల్లాలో ఈఏడాది 334 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో 126 ఘోరరోడ్డు ప్రమాదాలు, 170 సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 137 మంది మరణించారు. 388 మందికి గాయాలపాలయ్యారు. బ్లాక్‌స్పాట్స్‌ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, వాహనాదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కొరవడడంతో ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఈవ్‌టీజింగ్‌లో 41మంది మైనర్లు

జిల్లాలోని 1,285 హాట్‌స్పాట్స్‌ వద్ద షీటీంలు స్కూల్‌, కాలేజీ, బస్‌స్టాండ్‌ తదితర పబ్లిక్‌ ప్లేస్‌ల్లో 362మందిని రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అందులో 41మంది మైనర్లు ఉన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసి 37మందిపై ఈ పెటీ కేసులు నమోదు చేశారు.

ఆరుగురికి జీవితఖైదు

జిల్లాలో ఈ ఏడాది 41 కేసుల్లో 59 మందికి వివిధ శిక్షలు పడగా, అందులో ఆరుగురికి యావజీవకారా గార శిక్ష పడింది. ఇందులో ముగ్గురికి పదేళ్లు, ఐదు గురికి ఏడేళ్లు, మరో ఐదుగురికి ఐదేళ్లు, ఒకఏడాది నలుగురికి, ఏడాదిలోపు శిక్షలు 12మందికి, కేవలం జరిమానా మాత్రమే విధించిన కేసులు 15.. ఇలా వివిధ రకాల శిక్షలను కోర్టులు విధించాయి. వీరినుంచి రూ.3,53,350 జరిమానా విధించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులు మన వద్దే..

రికవరీ కొంతే

జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీలు కొంత తగ్గినట్లుకనిపిస్తున్నా.. రికవరీ శాతం పెరిగినా.. ఆందోళనకరమైన స్థాయిలోనే చోరీలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

పెరిగిన నేరాలు1
1/4

పెరిగిన నేరాలు

పెరిగిన నేరాలు2
2/4

పెరిగిన నేరాలు

పెరిగిన నేరాలు3
3/4

పెరిగిన నేరాలు

పెరిగిన నేరాలు4
4/4

పెరిగిన నేరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement