ప్రశాంతంగా పాలిసెట్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మంగళవారం చేపట్టిన పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. మొత్తం 2,488 మంది(1,336 మంది బాలురు, 1,152మంది బాలికలు) పరీక్షల కు హాజరుకావాల్సి ఉండగా 2,366 మంది (1,275మంది బాలురు, 1,091మంది బాలికలు) హాజరయ్యారన్నారు. పెద్దపల్లిలో ఏ ర్పాటు చేసిన ఆరు పరీక్ష కేంద్రాల వద్ద పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పు ష్కరాలకు కరీంనగర్ రీజియన్‌లోని కరీంనగర్, గోదావరిఖని, మంథని నుంచి 50 ప్ర త్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్ మే నేజర్ రాజు తెలిపారు. కరీంనగర్ నుంచి 30 బస్సులు, గోదావరిఖని, మంథని నుంచి 10 బస్సుల చొప్పున నడుపుతున్నట్లు పే ర్కొన్నారు. గోదావరిఖని నుంచి పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80 చార్జీ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.70, కరీంనగర్ నుంచి పెద్దలకు రూ.280, పిల్లలకు రూ.140 వసూలు చేయనున్నట్లు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
‘కేంద్రీయ’లో ప్రవేశాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శోభన్‌బాబు తెలిపారు. ఈనెల 16 నుంచి స్వీకరిస్తామన్నారు. సైన్స్, కామ ర్స్ గ్రూపుల కోసం ఈనెల 24వ తేదీలోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


