ఈకేవైసీపై అధికారుల ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి: జిల్లాలో ఇంకా ఈకేవైసీ నమోదు ను పూర్తిచేయని రేషన్‌కార్డుదారులపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్దేశిత లక్ష్య సాధన కోసం ప్రత్యేక ప్రణాళిక రచించారు. మరణించిన వారి పేర్లు, నకిలీ కార్డులు తొలగించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్‌కార్డుదారులు అందరూ రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇప్పటికే పలుమార్లు జిల్లావాసులకు సూచించారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కా నీ జిల్లావ్యాప్తంగా ఆ ప్రక్రియ నత్తనడకన సా గుతోంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 76శాతం మాత్రమే ఈకేవైసీ నమోదు పూర్తయిందని డీసీఎస్‌వో శ్రీనాథ్ తెలిపారు.


