వలసకూలీల సహపంక్తి భోజనం
పెద్దపల్లిరూరల్: యాసంగి వరి నాట్లు ఊపందుకుంటున్నాయి. రైతులు వరినారు పోసుకుని నాటేందుకు సిద్ధంగా ఉన్నా.. కూలీలు లభించడంలేదు. దీంతో పొరుగు గ్రామాల నుంచి రప్పించి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు 12 మంది నాటు వేసేందుకు అవసరమైతే.. రవాణాతోపాటు వారికి మొత్తంగా రూ.4,800 చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారు పెద్దమ్మనగర్‌కు చెందిన కూలీలు వరినాట్లు వేస్తూ ఆదివారం మధ్యాహ్నం వేళ తుర్కలమద్దికుంట శివారులోని ప్రధాన రహదారిపై ఒకేవరుసలో కూర్చుని భోజనం చేస్తూ ఇలా కనిపించారు.


