సుల్తానాబాద్‌ చేరిన ఎస్సారెస్పీ నీరు | - | Sakshi
Sakshi News home page

సుల్తానాబాద్‌ చేరిన ఎస్సారెస్పీ నీరు

Dec 29 2025 9:14 AM | Updated on Dec 29 2025 9:14 AM

సుల్తానాబాద్‌ చేరిన  ఎస్సారెస్పీ నీరు

సుల్తానాబాద్‌ చేరిన ఎస్సారెస్పీ నీరు

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: యాసంగి పంటల సాగు కోసం ఎస్సారెస్పీ ద్వారా వారబందీ పద్ధతిన ఈనెల 24వ తేదీన విడుదల చేసిన సాగునీరు ఆదివారం స్థానిక పూసాల సమీప ఎస్సారెస్పీ కాలువలోకి వచ్చిచేరింది. జూలపల్లి, ఎలిగేడు నుంచి సుల్తానాబాద్‌ వరకు కాలువద్వారా నీరుచేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగిత్యాల జిల్లాకు కేటా యించిన నీటిలో అదనపు నీటిని వృథా చేయ కుండా పెద్దపల్లి జిల్లాకు తరలిస్తున్నారని, ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని అధికారు లు చెబుతున్నారు. వాస్తవంగా ఎస్సారెస్పీ నీ రు వచ్చే ఏడాది జనవరి 2న జిల్లాకు చేరాలి.

కళాకారులను ఆదుకోవాలి

పెద్దపల్లి: జానపద కళాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని తెలంగాణ జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక నందన గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కళాకారుల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపుకార్డులు ఇవ్వాలని, వృద్ధులకు పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జానపద కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్‌ చంద్ర బోస్‌ మాట్లాడారు. నాయకులు, కళాకారులు సారయ్యగౌడ్‌, ఎద్దు మమత, కేశవేణి రమాదేవి, బూడిద అనసూయ, కొమురయ్య, నాంపల్లి, సింధుజ, కందుకూరి లలిత, మల్లమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగానికి పెద్దపీట

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శివపల్లిలోని తన నివాసంలో తెలంగాణ టీచర్స్‌ షెడరేషన్‌(టీఆర్టీఎఫ్‌) రూపొందించిన 2026 క్యాలెండర్‌, డైరీని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను సమీప హ్యాబీటేషన్‌లకు అనుసంధానం చేసి పునరుద్ధరించాలని అన్నారు. టీఆర్టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్‌, జిల్లా ప్రఽఽధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌, నాయకులు లక్ష్మీనారాయణ, రవికుమార్‌, మహేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవీందర్‌రావు, విఠల్‌, ప్రేమ్‌సాగర్‌, మహేశ్‌కుమార్‌, రమేశ్‌, కరుణాకర్‌రెడ్డి, నాగరు, లక్ష్మీనారాయణ, రమేశ్‌, మహేందర్‌, దస్తగిరి పాల్గొన్నారు. కాగా, సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల సర్పంచ్‌(స్వతంత్ర) కంపెల్లి సతీశ్‌కుమార్‌, వార్డుసభ్యులు ముత్యం జ్యోశీల, దుగ్యాల భూంరావు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

‘పరిషత్‌’లో సత్తా చాటుతాం

పెద్దపల్లిరూరల్‌: పరిషత్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని బీజేపీ జిల్లా పరిశీలకుడు నాగపురి రాజమౌళి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి, మంథని, రామగుండం సెగ్మెంట్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోపాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మీస అర్జున్‌రావు, గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, హనుమంతుగౌడ్‌, రావుల రాజేందర్‌, మహేశ్‌, పల్లె సదానందం, కడారి అశోక్‌రావు, కందుల సంధ్యారాణి, నల్ల మనోహర్‌రెడ్డి, మహేందర్‌, నిర్మల, రాము, అమరగాని ప్రదీప్‌, భాస్కర్‌రెడ్డి, శివంగారి సతీశ్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్రాంతి, రాజేందర్‌, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement