
దుకాణాల కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని సుమారు 25 దుకాణాలను బల్దియా అధికారులు బుధవారం కూల్చివేశారు. సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా 25 నుంచి 30 షాపులను తొలగించాలని అధికారులు ఇటీవల షాపుల నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో షాపుల నిర్వాహకులు ఆందోళనకు గుయ్యారు. జేసీబీ సాయంతో అధికారులు దుకాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వయంగా కూల్చివేతల తీరును పరిశీలించారు. వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేసి, దుకాణాలను కూల్చివేయడం సరికాదని ఆయన అన్నారు. అయితే కూల్చివేసిన దుకాణాల వెనుక సర్వీస్ రోడ్డుకు ఆటంకం లేకుండా తిరిగి దుకాణాలు కట్టుకోవడానికి సింగరేణి సంస్థ అంగీకారం తెలిపిందని సమాచారం.