
భవన నిర్మాణానికి భూమిపూజ
గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో రూ.10కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్, ఓఎస్‌డీ టు వీసీ డాక్టర్ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్, చీఫ్ వార్డెన్ మనోహర్, ఇంజినీర్ ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్ రమాకాంత్, అధ్యాపకులు రమేశ్‌రెడ్డి, రవి, ప్రసాద్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.