
ఉద్రిక్తతల మధ్య వైన్స్ భవనం కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని వైన్స్‌షాప్ భవనాన్ని పోలీస్ బందోబస్తు మధ్య రామగుండం బల్దియా అధికారు లు శుక్రవారం కూల్చివేత ప్రారంభించారు. ఫోర్‌లే న్ సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇటీవల సు మారు 25 దుకాణాలను కూల్చివేసిన అధికారులు.. చివరగా రోడ్డు సమీపంలోని మద్యం దుకాణ భవనాన్ని కూడా కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు. రాజీవ్ రహదారి పక్కనే భవనం ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌టౌన్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కూల్చివేతను అడ్డుకున్న భవన యజమాని గాజుల రాజమల్లుతోపాటు ఆయన కుమారుడిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 21వ తేదీ వరకు స్టేటస్‌కో ఉండగా ఎలా కూల్చివేస్తున్నారని ఆయన బల్దియా అధికారులను ప్రశ్నించారు.