
రేపు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం
గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావే శం ఈనెల 6న జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని మున్సిపల్, మూడు మండలాల నాయకుల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు. సమావేశానికి పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌నాయకు లు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు హాజరవుతారని ఠాకూర్ వివరించారు.