
జెన్‌కో సీఈవో హరీశ్‌తో ఎమ్మెల్యే ఠాకూర్ భేటీ
గోదావరిఖని: తెలంగాణ జెన్‌కో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతోపాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ఏర్పాటుపై చర్యలను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చవచ్చని, స్థానిక అభివృద్ధికి తోడ్ప డేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ వివరించారు.
విద్యార్థుల భవిష్యత్‌ను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి
పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్/సుల్తానాబాద్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్‌కు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సూచించారు. పెద్దపల్లి జెడ్పీహై స్కూల్, ఎన్టీపీసీ జెడ్పీహై స్కూల్‌లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, తెలుగు భాషా పండితులు, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడ ల్ స్కూల్‌లో ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్‌జీటీల శిక్షణ శిబిరాలను శుక్రవారం ఆయ న సందర్శించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం గుణాత్మక విద్య అందించాలని ఆయన ఉపా ధ్యాయులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగం శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేజీబీవి ప్రత్యేకాధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తోపాటు కోర్సు డైరెక్టర్ జయరాజు, ఎంఈవో చంద్రయ్య, రిసోర్స్‌పర్సన్స్ ఆగయ్య, రాగమణి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్‌తోపాటు సుల్తానాబాద్ ఎంఈవో రాజయ్య, ప్రోగ్రాం అబ్జర్వర్ ప్రద్యుమ్నకుమార్, రిసోర్స్ పర్సన్స్ జగదీశ్వర్, శ్రీనివాస్, నాగరాజు, అనిల్ తదితరులు ఉన్నారు.
శిక్షణలో నేర్చుకున్నది అమలు చేయాలి
సుల్తానాబాద్‌రూరల్: శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం మెరుగుపడు తుందని స్టేట్ రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ అన్నారు. గర్రెపల్లి జెడ్పీ హెచ్‌ఎస్‌లో శుక్రవారం జీవశాస్త్రం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ హాజరై శిక్షణ తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వి ద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని, తద్వారా విద్యార్థు ల్లో ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్పీలు లక్ష్మీనారాయణ, కిరణ్‌కుమార్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
ధ్యానంతో ఏకాగ్రత
జ్యోతినగర్(రామగుండం): ధ్యానంతో ఏకాగ్రత లభిస్తుందని హార్ట్‌పుల్‌నెస్ మెడిటేషన్ సంస్థ ఇన్‌చార్జి అహ్మద్ పాషా, ట్రైనర్స్ స్వామి, శ్రీనివాస్, నరసింహారెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధ్యానం సాధన ద్వారా మానసిక ప్రవాంతత చేకూరుతుందని తెలిపారు. వలంటీర్టు మహర్షి, రవి, మల్లయ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

జెన్‌కో సీఈవో హరీశ్‌తో ఎమ్మెల్యే ఠాకూర్ భేటీ

జెన్‌కో సీఈవో హరీశ్‌తో ఎమ్మెల్యే ఠాకూర్ భేటీ

జెన్‌కో సీఈవో హరీశ్‌తో ఎమ్మెల్యే ఠాకూర్ భేటీ