
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కోల్‌సిటీ(రామగుండం): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఇందుకోసం గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరిఖనిలోని సిమ్స్‌లో వైద్యసేవలపై శుక్రవారం కలెక్టర్ వైద్యా ధికారులతో సమీక్షించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖని ప్రభుత్వ బోధన ఆస్పత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలని అన్నారు. తొలికాన్పులో సిజేరియన్ ఆపరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలన్నారు. గర్భిణు ల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. జీజీహెచ్‌లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, కాంప్లికేటెడ్ కేసులకు సై తం మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. అంతర్గాం, పుట్నూరు, గోదావరిఖని, రామగుండం పరిసరాల్లో ఆశ వర్కర్ల ద్వారా జ నరల్ శాస్పత్రిలోని వసతులపై ప్రజలకు అవగా హన కల్పిస్తూ ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోకుండా అధికారు లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి, హెచ్‌వోడీలు అరుణ, శ్రీదేవి, ఆర్‌ఎంవో రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎల్బీనగర్‌లో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణాన్ని కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలనీ ఆదేశించారు. అనంతరం శారదానగర్‌లోని తాత్కాలికంగా చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు.
సకాలంలో అన్‌లోడ్ చేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): రైస్ మిల్లుల్లో సకాలంలో ధాన్యం అన్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పూసాల మిథీలా రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. మిల్లుల్లో లారీలు అత్యధిక సమయం ఉండకుండా వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, డీటీసీఎస్‌లు మహేశ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి