
జై జవాన్.. జై భారత్.. త్రివర్ణశోభితం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం శుక్రవారం త్రివర్ణశోభితమైంది. సిటిజన్ ఫర్ నేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గు జ్జుల రామకృష్ణారెడ్డి, కాశిపేట లింగయ్యతోపాటు వ్యాపార, వాణిజ్యవేత్తలు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు. పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టిబుద్ధి చెప్పిన వీరజవాన్లకు మద్దతునిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద మొదలైన తిరంగా ర్యాలీ పలు ప్రధాన ప్రాంతాల్లో కొనసాగింది. అతిథులు జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్ అని నినాదాలు చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడికి తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత జవాన్లు గట్టి గుణపాఠం చెప్పారని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రా మకృష్ణారెడ్డి, లింగయ్య, నాయకులు కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, కన్నం అంజయ్య, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాజేందర్, సదానందం, సమ్మ య్య, జంగ చక్రధర్‌రెడ్డి, క్రాంతికుమార్, శివంగారి సతీశ్, దిలీప్, మంథెన కృష్ణ, తూడి రవి, మిట్టపల్లి వెంకటేశం, సంతోష్, శ్రీకాంత్, నరేశ్ తదితరులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర హాజరైన ఎమ్మెల్సీ మల్క కొమురయ్య