జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి

May 15 2025 2:20 AM | Updated on May 15 2025 2:20 AM

జాబ్‌

జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి

గోదావరిఖని: సింగరేణి చేపట్టిన మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా కోరారు. తన కార్యాలయంలో బుధవారం ఆ ర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి జాబ్‌మేళా ప్రచార వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగ యువతీయువకుల కోసం మేళా చేట్టారన్నారు. దాదాపుగా 100పైగా కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. సుమారు 3వేలకు పైచిలుకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఈనెల 18న ఉదయం 8గంటలకు ప్రారంభమైయ్యే మేళా గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఏసీపీ రమేశ్‌, అడ్మిన్‌ డీసీపీ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేందర్‌రావు, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రథోత్సవం

ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు రామిడి వెంకటరాంరెడ్డి. శ్రీనివాసరెడ్డి, కొండల్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అర్చకులు కొండపాక రామాచార్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

పెద్దపల్లిరూరల్‌: మున్సిపల్‌ పరిధిలో రోడ్లను ఆక్రమించి సామగ్రిని నిల్వ చేసినా, చెత్తాచెదారం పడేసినా జరిమానా విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ హెచ్చరించారు. స్థానిక బస్టాండ్‌ ప్రాంతంలోని స్క్రాప్‌ దుకాణం ఎదుట ఇనుప సామగ్రి నిల్వ ఉంచగా రూ.20వేల జరిమానా విధించి బుధవారం ఆ సొమ్ము వసూలు చేశారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబరు 6303127484కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తామని అన్నారు. వార్డు ఆఫీసర్లు అనిల్‌, ప్రదీప్‌, సాగర్‌, సురేశ్‌నాయక్‌ పాల్గొన్నారు.

పడిపోతున్న నీటిమట్టం

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. నీటిపారుదలశాఖ అధికారులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లేదు. హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలకు 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.

మెరిసిన ‘కరాటే’ హాసిని

మంథని: మలేషియాలోని హైపోసిటీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పట్టణానికి చెంది న జపాన్‌ షిటోరియా కరా టే అకాడమీ విద్యార్థిని మె ట్టు హాసిని పతకాలు సాధించినట్లు ఇన్‌స్ట్రక్టర్‌ కావేటి సమ్మయ్య తెలిపారు. 66 కేజీల విభాగాల్లో బంగారు, వెండి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. బాలికను కరాటే జాతీయ ఉపాధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు సమ్మయ్య అభినందించారు.

జాబ్‌ మేళా    సద్వినియోగం చేసుకోవాలి 1
1/3

జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి

జాబ్‌ మేళా    సద్వినియోగం చేసుకోవాలి 2
2/3

జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి

జాబ్‌ మేళా    సద్వినియోగం చేసుకోవాలి 3
3/3

జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement