
నాణ్యమైన ధాన్యం కొనాలి
ఓదెల(పెద్దపల్లి): రైతులు తీసుకొచ్చిన నాణ్యమైన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు సూచించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. టార్పాలిన్ కవర్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాల ని సూచించారు. అనంతరం స్థానిక తహసీల్దా ర్ కార్యాలయాన్ని సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఫౌర సరఫరా ల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
కార్మికుల చర్చలు సఫలం
పెద్దపల్లిరూరల్: తమ సమస్యలు, పరిష్కరించాలని, బకాయి వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో వారం రోజులుగా రైల్వే కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం విరమించారు. సమస్యలను పరిష్కరించి, బకాయి వేతనాలను ఈనెల 12న చెల్లించేందుకు అంగీకరించడంతో కార్మికులు సమ్మె విరమించారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు తెలిపా రు. రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ అసిస్టెంట్ కమిషనర్ పాల్వాయి రవి, కృష్ణమోహన్, రామగుండం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ తదితర అధికారులతో యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయన్నారు. కార్మిక సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సీపెల్లి రవీందర్, లక్ష్మి, రాజలింగం, అమృత, అరుణ, మల్లయ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు.
మూడు గ్రామాల్లో సదస్సులు
ఎలిగేడు(పెద్దపల్లి): భూభారతి చట్టం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, నారాయణపల్లి, సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ధూళికట్టలో 55, సుల్తాన్‌పూర్‌లో 53, నారాయణపల్లిలో 46 దరఖాస్తులు స్వీకరించారు. తహసీల్దార్ బషీరొద్దీన్, అధికారులు, జయలక్ష్మి, చంధ్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు.
మహిళా రెస్యూ సభ్యుల ఎంపికకు పరీక్ష
గోదావరిఖణి: సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో శుక్రవారం మహిళా రెస్క్యూ సభ్యుల ఎంపిక పరీక్ష నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్, జనరల్, బదిలీ అసిస్టెంట్లకు చెందిన 18 మంది హాజరయ్యారు. నైపుణ్యం పెంపు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన తీరు, రిస్క్ మేనేజ్‌మెంట్, జ్ఞాపకశక్తి, శారీరక ఫిట్‌నెస్, ప్రథమ చికిత్స, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితర అంశాలపై పరీక్ష నిర్వహించారు. మందమర్రి, కొత్తగూడెం ఏరియాలో ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 13న భూపాలపల్లిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 48మంది భూగర్భగనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏడుగురు ఉపరితల గనుల్లోని ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నా రు. రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావ్, డీవైఎస్‌ఈ మూర్తి, అడిషనల్ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పిల్లలపై దృష్టి సారించాలి
పెద్దపల్లిరూరల్: గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నశాముక్త భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల అన్నారు. గుర్రాంపల్లిలో శుక్రవారం ఉపాధిహా మీ కూలీలకు అవగాహన కల్పించారు. చాక్లె ట్లు, కూల్‌డ్రింక్స్, పౌడర్ రూపాల్లో డ్రగ్స్ పల్లెలదాకా చేరుతోందని తెలిపారు. పిల్లల అలవాట్లను పరిశీలించాలన్నారు. డ్రగ్స్ అమ్మకాల గురించి తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 14446కు సమాచారం అందించాలని కోరారు.

నాణ్యమైన ధాన్యం కొనాలి

నాణ్యమైన ధాన్యం కొనాలి

నాణ్యమైన ధాన్యం కొనాలి