
రూ.58.43 కోట్లతో అభివృద్ధి పనులు
● రామగుండం బల్దియా ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో రూ.58.43 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.9 కోట్ల 64 లక్షలు, ఎల్‌ఆర్‌ఎస్ ఇంట్రెస్ట్ ఫండ్స్ కింద రూ.84 లక్షలు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.50 లక్షలు, టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.45 కోట్లతోపాటు ప్ర త్యేక అభివృద్ధి కింద రూ.కోటి 84 లక్షలు, వరద స హాయ నిధుల కింద రూ.65 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన వివరించారు.
ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడాలి
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ, ఆయుర్వేద, హోమియో, మాతాశిశు ఆస్పత్రుల్లో వైద్యసేవలు మరింత మెరుగుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దాని ఆవరణలోని పలు విభాగాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు అందించడంతోపాటు వారి సహాయకులకు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేసి టెలివిజన్‌లను అమర్చాలని సూచించారు. డయగ్నొస్టిక్ కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్‌ఎంవో విజయ్ తదితరులు ఉన్నారు.
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి
జిల్లాలో ఆయిల్‌పాం సాగు వైపు రైతులను మళ్లించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. కలెక్టరేట్‌లో సాగు ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఆయిల్‌పాంకు కోతులబెడద ఉండదని, నాలుగేళ్ల దాకా అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. ఆ తర్వాత అధికంగా ఆదాయం సమకూరుతుందనే విషయాలను రైతులకు వివరించాలని సూచించారు. సెప్టెంబర్ వరకు 1,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, సీఈవో శేషు తదితరులు ఉన్నారు.