
ఏడాది ఎక్కువైనా ఉద్యోగం
వయో పరిమితి అధికంగా ఉండడంతో అసలు ఉద్యోగం రాదనే అనుకున్నా. యాజమాన్యం వయో పరిమితి పెంచడంతో నా వయసు 36 ఏళ్లు అయినా ఉద్యోగం వచ్చింది. సీఎండీ బలరాంకు కృతజ్ఞతలు. వయోపరిమితి పెంచడంతో ఉద్యోగం లభించింది. మా నాన్న జీడీకే–11గనిలో రామ్‌కార్ ఆపరేటర్‌గా పనిచేసి మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యాడు.
– తడికెల పవన్, డిపెండెంట్, గోదావరిఖని
వెలుగులు నింపారు
వయో పరిమితి పెరగడంతో ఉద్యోగం రాదనుకున్నాం. యాజమాన్యం వయసు 40 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగ అవకాశం దక్కింది. మా నాన్న సత్తయ్య ఓసీపీ–3 సీహెచ్‌పీలో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేశాడు. వయో పరిమితి పెరగడంతో కుటుంబంలో వెలుగులు నిండాయి. పోరాటం చేసిన కార్మిక సంఘాల నాయకులు, అమలు చేసిన సీఎండీకి కృతజ్ఞతలు.
– ఎతిరాజు రాజేశ్వరి, పూట్నూర్

ఏడాది ఎక్కువైనా ఉద్యోగం