Earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు | Earthquake in Prakasam District | Sakshi
Sakshi News home page

Earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

May 6 2025 11:33 AM | Updated on May 6 2025 11:53 AM

Earthquake in Prakasam District

సాక్షి,అమరావతి: ప్రకాశం జిల్లా పొదిలిలో భూ ప్రకంపనలు(Earthquake) సృష్టించింది. 

జిల్లాలోని దర్శి,పొదిలి, కురిచేడు, ముండ్లమూరులో భూ ప్రంపనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 5సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో భయంతో ఇండ్లలో నుంచి  జనం బయటకు పరుగులు తీశారు. గత ఏడాది సైతం ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులో  భూమి కంపించింది. 

కాగా, సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అటు నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో భూమి కంపించింది.

Advertisement
 
Advertisement
Advertisement