
ఇళ్లపట్టాలు అందిస్తాం
రామగుండం: పాములపేట బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. తన స్వగ్రా మం ఆబాది రామగుండంతోపాటు పాములపేటలో బుధవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేశారు. తాను ఏస్థాయిలో ఉన్నా తన చివరి శ్వాస వరకు తన సొంత ప్రాంతంతోనే ముడిపడి ఉంటుందని హర్కర అన్నారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీ, నాయకులు ఈదునూరి హరిప్రసాద్, వాజిద్‌అలీ, పల్లికొండ శ్యాం తదితరులు ఉన్నారు.
వాహనదారులు హెల్మెట్ ధరించాలి
గోదావరిఖని: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో యోనోఎస్‌బీఐ, ప్రైవేట్ స్కూళ్ల సహకారంతో నిర్వహించిన ఉచిత హెల్మెట్ల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. డీసీపీ(అడ్మిన్) రాజు, ఏసీపీలు రమేశ్, జాన్ నర్సింహులు, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై హరిశేఖర్, సంతోష్‌కుమార్, రామరాజు పాల్గొన్నారు.
వివరాలు నమోదు చేయాలి
పెద్దపల్లిరూరల్: ఆస్పత్రుల్లోని మందుల వివరాలను ఈ ఔషధిలో నమోదు చేయాలని డీ ఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించా రు. కలెక్టరేట్‌లో బుధవారం వైద్యాధికారులు, ఫార్మసీ అధికారులతో సమావేశమై పలు సూచనలిచ్చారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ తగలకుండా పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్, కీటకజనిత వ్యాధుల నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే 108 వా హన సిబ్బందికి ఫోన్‌చేయాలని కోరారు. మూ డు నెలల్లోపు గర్భం వద్దు అనుకునే వారికి ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు అబార్షన్ కేర్ ఉందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల ని ఆమె సూచించారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, వాణిశ్రీ, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
16న ‘చలో ఇందిరా పార్క్’
గోదావరిఖని: మారుపేర్ల కార్మికుల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 16న చ లో ఇందిరాపార్క్ చేపట్టామని బాధితుల సంఘం నాయకుడు లక్క శ్రవణ్ తెలిపారు. స్థాని క ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలన్నారు. సింగరేణి చేస్తున్న కాలయాపనతో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయన్నారు. ఈ క్రమంలో చేపట్టిన నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని ఆయన కోరా రు. నాయకులు శ్రీనివాస్, వంగ సంతోష్, పార్థపల్లి హరీశ్, ఈర్ల రాజయ్య, బాబు, బొద్దు ల రంజిత్, ఓంప్రకాశ్, రామిండ్ల సందీప్, గు ర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్, మోతుకూరి రవికుమార్, రవి, రాజకుమార్ పాల్గొన్నారు.
ప్రమాదాలపై అప్రమత్తం
సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వి ద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో వరంగల్ హెచ్‌ఆర్– డీ సెక్షన్ అధికా రి అశోక్‌కుమార్ సూచించారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్‌లో బుధవారం విద్యుత్ అధికారులు, సిబ్బందితో కలిసి వారోత్సవాల ప్ర చార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు వినియోగదారులు వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. వేసవిలో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ఎస్ ఈమాధవ్‌రావు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు కిశోర్, సంపత్, సైఫుద్దీన్, దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లపట్టాలు అందిస్తాం