భారత్‌ విమానాలు కూల్చివేత అంటూ పాక్‌ ప్రచారం.. నిజమెంత? | Pakistan Claimed It Shot Down Three Indian Air Force Fighter Jets, Know Fact Check Inside | Sakshi
Sakshi News home page

Operation Sindoor: భారత్‌ విమానాలు కూల్చివేత అంటూ పాక్‌ ప్రచారం.. నిజమెంత?

May 7 2025 9:50 AM | Updated on May 7 2025 10:06 AM

Pakistan Claimed It shot down three Indian Air Force fighter jets

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్‌ను భారత్‌ దెబ్బకొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేసింది. ఇక, ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ విజయవంతమైనట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. దాడులపై పాకిస్తాన్‌ స్పందిస్తూ.. భారత్‌కు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్టు దాయాది పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా పేర్కొంది.

ది హిందూ కథనం మేరకు.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా రెండు రాఫెల్ జెట్‌లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌ ఆర్మీ విజయవంతంగా భారతీయ జెట్‌లను కూల్చివేసిందని తెలిపింది. అయితే, ఈ వాదనలను భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో IAF విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. పాంపోర్, అఖ్నూర్ మీదుగా యుద్ధ విమానాలు డ్రాప్ ట్యాంకులను విసిరాయని భారత రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదంతా ఫేక్‌ ప్రచారమని తెలిపింది.

మరోవైపు.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్‌ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ చేసి పాక్‌ నీచ బుద్ధిని బయటపెట్టింది. ‘పాక్‌ సైన్యం సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవి. భారత్‌కు చెందినవి కూడా కాదు. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్‌లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి’ అని కేంద్రం భారత పౌరులకు సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement