
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్ వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యం భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోసారి స్పందించారు.
ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
U.S. President Donald Trump has condemned India's attack, calling it shameful
Pakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025
చైనాకు భారత్ వార్నింగ్
మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.