
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీలిమిటేషన్, పీసీసీ క్రమశిఓణ కమిటీలకు సైతం ఏఐసీసీ ఆమోదం తెలిపింది.
22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇంఛార్జ్ ,సీఎం, పీసీసీ అధ్యక్షుడితో కలపుకొని మొత్తం 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏర్పాటు కానుంది. అడ్వైజరి కమిటీలో ఇంఛార్జీ ,సీఎం, పీసీసీ చీఫ్ తో కలుపుకుని 15 మందికి చోటు కల్పించనున్నారు. డీ లిమిటేషన్ కమిటీలో 7 మందికి అవకాశం ఇవ్వనున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడు మంది సభ్యులు ఉండనున్నారు.
పీఏసీ(పొలిటికల్ అఫైర్స్ కమిటీ)లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు, ఇక అడ్వైజరీ కమిటీలో రేవంత్, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండనున్నారు. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచందర్ రెడ్డి నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గా పి. వినయ్ కుమార్ లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.