
పనిచేయని ఆర్వో ప్లాంట్
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని సింగరేణి యజమా న్యం చెబుతున్నా.. తాగునీటి విషయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్జీ–2 ఏరి యా యైటింక్లయిన్‌కాలనీలో నివాసం ఉంటున్న కా ర్మిక కుటుంబాలకు మినరల్ వాటర్ అందించేందు కు ఏడాది క్రితం దాదాపు రూ.16.50 లక్షల వ్య యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అది ఎప్పుడూ పనిచేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు.
పనిచేయని బోరు
స్థానిక తెలంగాణ చౌరస్తా వాటర్ ట్యాంక్ వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన అధికారులు.. దాని సమీపంలోనే బోరు వేశారు. అయితే, కొద్దిరోజులకే బోరు పనిచేయకుండా పోయింది. దీంతో గోదావరి నది నుంచి వచ్చే నీటిని వాటర్ ట్యాంక్‌కు అనుసంధానించి.. ఆ నీటినే కార్మిక కాలనీలకు అందిస్తున్నారు. గోదావరిలో ప్రస్తుతం నీరు ఆశించినంత లేదు. ఫలితంగా బొగ్గు గనుల్లోని వృథా నీరు, మరికొంత గోదావరి నీటిని కలిపి శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. నిర్వహణ సరిగా లేక నీటిని శుద్ధిచేసే ఎంఎంవోఆర్ యంత్రం పనిచేయడంలేదు. ఫలితంగా కలుషిత నీరే దిక్కవుతోందని కార్మిక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
మరమ్మతుల విస్మరణ..
ఎంఎంవోఆర్ యంత్రాన్ని మరమ్మతు చేయడం లే దు. ఫలితంగా కొన్నినెలలుగా ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే శుద్ధికాని నీటిని నేరుగా కార్మిక కాలనీలకు సరఫరా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ నీరు తాగడంతో గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం, జలుబు వంటి వ్యాధులకు గురవుతున్నామని వా పోతున్నారు. ఈవిషయంపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
కార్మిక కాలనీలకు కలుషిత నీరే దిక్కు
పట్టించుకోని సింగరేణి అధికారులు