
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్(పెద్దపల్లి): భూభారతితో భూ స మస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలో బు ధవారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ మాట్లాడా రు. ప్రతీరైతుకు భూభద్రత కల్పించడమే చట్టం లక్ష్యమన్నారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, తహసీల్దార్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రావొద్దు
కాల్వశ్రీరాంపూర్/ముత్తారం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్వాహకులను ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రం నుంచి రోజూ 8 వరకు లారీలు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఐకేపీ ఏపీఎం కనుకయ్య, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. పలుఅభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఇంటింటికీ తాగునీరు అందించాలన్నారు. డబుల్‌బెడ్రూమ్ ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఆస్తిపన్నును సమీక్షించాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణంప్రారంభించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను ఈనెలాఖరులోగా లబ్దిదారులకు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సుల్తానాబాద్ కు చెందిన నిట్టూరి మానసకు శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిలో గడ్డలు తొలగించిన వైద్యులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.