
సాధారణంగా మనం షాపింగ్‌కి వెళ్లి కొత్తగా బట్టలు కొనుగోలు చేసి వెంటనే వేసుకుని చూస్తాం. పైగా అవి మనకు సరిగ్గా సరిపోయిందో లేదని ట్రయల్ రూంలో వెళ్లి మరి చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇంటికి తెచ్చుకుని నేరుగా ధరించేస్తాం. ఇది సర్వసాధారణం. చాలామటుకు అందరు ఇలానే చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన బట్టలను కొందరు దేవుడి వద్ద పెట్టి అలానే వేసుకుంటాం. కానీ అలా వేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు చర్మ నిపుణులు. కొన్ని కొత్త బట్టలు వాటికి ఉపయోగించే రసాయనాల రీత్యా అలా కొత్త బట్టలను నేరుగా ధరించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అలా అనడానికి రీజన్ ఏంటో చూద్దామా..!.
స్టైలిష్‌గా ఉండే దుస్తులు ధరించడం నేటి యువత ట్రెండ్. అందుకోసం సరసమైన ధరల్లో లభించే బజార్‌లు తెలుసుకుమని కొంటున్నారు. కొందరు బ్రాండ్‌వి కొనుగోలు చేయగలరు. మరికొందరు వన్‌ప్లస్ టు ఆఫర్‌లు లేదా కాస్త తక్కువ ధరకు దొరికే చోట కొనుగోలు చేస్తుంటారు. అయితే అలానే ఒక కుర్రాడు బట్టలుకొని నేరుగా ధరించాడు. అంతే ఒక్కసారిగా అలెర్జీల ఒంటిమీద ఎర్రటి పొక్కులు వచ్చేశాయి.
అందరిలానే కొత్తగాకొన్నవే కదా అని వేసుకున్నాడు. కానీ దాని వల్ల అతడు బాడీ అంత ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి..దారుణంగా తయారైంది. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై డెర్మటాలజిస్ట్‌లు స్పందించారు. అతడి పరిస్థితిని మొలస్కం కాంటాజియోసమ్ అనే అంటువ్యాధి అని అన్నారు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్‌గా నిర్థారించారు.
ఈ మధ్య రెట్రో ఫ్యాషన్ ఓ ట్రెండ్‌గా మారింది. అంతేగాదు పర్యావరణ హితంగా రీసైకిల్ చేసిన పాత బట్టలను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అలాంటివి కూడా కొన్నవెంటనే నేరుగా ధరిస్తే ఇలాంటి ప్రమాదమే ఎదురవుతుందని అన్నారు. అంతేగాదు కొన్న వెంటనే ఎలాంటి బ్రాండెడ్ బట్టలైన ఉతికి ధరిస్తేనే మంచిదని సూచించారు.
ఎందుకంటే ఆయా ఫ్యాబ్రిక్‌ల రంగుల కోసం ఉపయోగించే గాఢ రసాయనాలు.. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు కలిగించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు న్యూయార్క్‌కి చెందిన వైద్య నిపుణుడు. అలాగే ఇలాంటి అవాంఛిత చర్మ సమస్యలను నివారించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన స్టైలిష్‌వేర్ అయినా ఒక్కసారి వాష్ చేశాక ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు.
గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: ఓఆర్‌ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..? హెచ్చరిస్తున్న నిపుణులు)